in

nithin all set to romance meenakshi chaudhary!

nithin and meenkashi chaudhary

నితిన్ హిట్టు అనే మాట విని ఆరేళ్లు దాటిపోయింది. 2020లో వ‌చ్చిన భీష్మ త‌ర్వాత ఈ టాలీవుడ్ హీరో చేసిన ఏడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. ఈ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా కొత్త సినిమాల‌ను సెట్స్‌పైకి తీసుకొస్తున్నాడు. ఇప్ప‌టికే హీరోగా మూడు సినిమాలు చేస్తోన్న‌ నితిన్…తాజాగా మ‌రో రొమాంటిక్ కామెడీ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. నారి నారి న‌డుమ మురారి, సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా ఫేమ్ రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమాను నితిన్ మేనేజ‌ర్ వెంక‌ట‌ర‌త్నం నిర్మించ‌నున్న‌ట్లు స‌మాచారం..

ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో నితిన్ స‌ర‌స‌న హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రిని ఎంపిక‌చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ ఇద్ద‌రిపై ఇటీవ‌లే ఓ లుక్ టెస్ట్‌ను కూడా నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం. మీనాక్షితో పాటు మ‌రో నాయిక కూడా ఈ సినిమాలో క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది..మ‌రోవైపు సంక్రాంతికి వ‌స్తున్నాం, అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకున్న మీనాక్షి చౌద‌రి నాగ‌చైత‌న్య వృష‌క‌ర్మ సినిమా చేస్తోంది. ప్ర‌స్తుతం అలియాస్ రుక్మిణితో పాటు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో నితిన్ ఓ సినిమా చేస్తోన్నాడు. నాని నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అలియాస్ రుక్మిణి మూవీ డిసెంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది..!!

nidhi aggarwal shifting completely from mumbai to hyderabad!