
డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన శ్వేతా నాయుడు..కంటెస్టెంట్‌గా, టీమ్ లీడర్‌గా తన ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా ‘ఢీ 17’ సీజన్లో రన్నరప్‌గా నిలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా, పంచ్ డైలాగ్స్‌తో, హైపర్ ఆది వంటి స్టార్ కమెడియన్లతో ఆమె వేసే కామెడీ పంచులు షోకి మరింత హైలైట్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మిలియన్ల కొద్దీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డ్యాన్స్ రీల్స్, ట్రావెల్ వ్లాగ్స్‌తో ట్రెండింగ్‌లో ఉంటారు..
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సేతో కలిసి ఆమె చేసిన కవర్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. గతంలోనే ఆమె ఎంట్రీపై అనేకసార్లు రూమర్స్ వచ్చినప్పటికీ..ఈసారి సీజన్ 10లో వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె ఎంట్రీ ఖరారైనట్లు గట్టిగా వినిపిస్తోంది. శ్వేతా నాయుడుతో పాటు మరికొద్ది మంది సెలబ్రిటీలు కూడా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ జాబితాలో..నీతు నటరాజ్, శివ్ కుమార్, నవరసాలు ఆర్కే, కావ్య శ్రీ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి..!!
