in

Mamitha Baiju to play an important role in Jai Hanuman!

Keerthy Suresh’s Dorothy

టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రతీ అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటుంది. తాజాగా ఈ సినిమాలో నటీనటుల ఎంపికకు సంబంధించి ఒక ఆసక్తికరమైన సమాచారం సినీ వర్గాల నుంచి బయటికి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ చిత్రంలో ప్రముఖ నటి మమిత బైజు ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చిత్రంలో అత్యంత ప్రాధాన్యమున్న ఒక కీలకమైన పాత్ర కోసం ఈ టాలెంటెడ్ నటిని మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం అందుతోంది. మమిత బైజు తన అద్భుతమైన నటనతో ఇప్పటికే యువతలో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో ఆమె పాత్ర కథను మలుపు తిప్పేలా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలకు ఎంపికయ్యారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హనుమంతుడిగా నటిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నటుడు దగ్గుబాటి రాణా మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు..!!

Mrunal Thakur backs Katrina Kaif, Kriti Sanon amid online trolling!

Swetha Naidu enters the Bigg Boss house as wild card entry!