in

Mrunal Thakur backs Katrina Kaif, Kriti Sanon amid online trolling!

Keerthy Suresh’s Dorothy

ఇటీవల తన ‘పూజా మేరీ జాన్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రసవానంతర శారీరక మార్పుల కారణంగా కత్రినా కైఫ్ బాడీ షేమింగ్‌కు గురికావడం, ఒక జువెలరీ యాడ్‌లో ధరించిన దుస్తుల కారణంగా కృతి సనన్ విమర్శలు ఎదుర్కోవడం వంటి సంఘటనల నేపథ్యంలో ఆమె స్పందించారు. కత్రినా, కృతి ఇద్దరూ సినిమా రంగానికి ఎంతో సేవ చేశారని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని గుర్తుచేశారు..

“ప్రతి విషయంలోనూ తప్పులు వెతకడం మానుకోవాలి. సోషల్ మీడియాలో కొందరి ప్రవర్తన చూస్తుంటే పిచ్చి పట్టినట్లుంది” అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. వారి కృషిని, విజయాన్ని మరిచిపోయి చిన్న విషయాలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. ఒకప్పుడు మహిళలను మాత్రమే ఎక్కువగా విమర్శించేవారని, కానీ ఇప్పుడు పురుషులు కూడా ఇలాంటివి ఎదుర్కొంటున్నారని మృణాల్ పేర్కొన్నారు. కాగా, విమర్శల నేపథ్యంలో కృతి సనన్ నటించిన జువెలరీ ప్రకటనను సంబంధిత సంస్థ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే..!!

Janhvi Kapoor condemns AI-generated, sexualized deepfake videos!

Mamitha Baiju to play an important role in Jai Hanuman!