
టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న హీరోలలో నాని ఒకరు. ఆయన ఎంచుకునే కథలు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ప్రశంసలు అందుకుంటుంటాయి. తాజాగా ఓజీ చిత్ర దర్శకుడు సుజిత్ తో నాని ఒక భారీ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ‘బ్లడీ రోమియో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది..
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్‌గా యువ నటి ప్రీతి ముకుందన్‌ను మేకర్స్ ఫైనల్ చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఆమె అందం అలాగే అభినయం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. మరో ముఖ్యమైన హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ నటి మీనాక్షి చౌదరితో కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు భామలు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని అత్యంత స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.!!
