
రాశీ ఖన్నా ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకున్న కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఫిలిం నగర్ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న షారుఖ్ ఖాన్ జీవనశైలిని తాను ఎంతగానో ఇష్టపడతానని ఆమె స్పష్టం చేశారు..
తాజా సమాచారం ప్రకారం తన యాక్టింగ్ కెరీర్లో ఒక్క వారమైనా సరే షారుఖ్ ఖాన్ లా బతకాలనే కోరిక ఉందని రాశీ ఖన్నా ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. ఆయనతో తన కెరీర్ను స్వాప్ చేసుకోవాలని ఉందని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు. వేర్వేరు జనరేషన్లకు చెందిన ప్రజలు కూడా ఆయనను అమితంగా ఆరాధిస్తారని ఆమె ప్రశంసించారు. కేవలం మాటలతో కాకుండా కళ్లతోనే వేయి మాటలు పలికించగల గొప్ప నటుడు షారుఖ్ ఖాన్ అని ఆమె కొనియాడారు. తెరపై ఆయన ఎఫర్ట్లెస్గా చేసే రోమాన్స్ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తుందని పేర్కొన్నారు..!!
