
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘ఎపిక్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆనంద్ దేవరకొండ వదిన రష్మిక మందన వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వేదికపై ఆమె పలికిన తెలంగాణ యాసపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో యాంకర్ మాట్లాడుతూ ‘లవ్ విషయంలో విజయ్ దేవరకొండ గురించి ఒక్క మాట చెప్పమంటే ఏం చెబుతారు?’ అని రష్మికను అడిగారు..
దానికి రష్మిక స్పందిస్తూ..విజయ్ గారి గురించి ఏం చెప్పాలి..ఆయన జిమ్‌లో ఉన్నారు. నాకు జెలస్‌గా ఉంది, ఇంటికి వెళ్లాక చూసుకుంటా. నేను విజయ్ గారితోటే షూటింగ్ చేసి వచ్చినా.. ‘ఏందయ్యా సామీ..’ పాట షూటింగ్ జరుగుతోంది’ అని తెలంగాణ యాసలో మాట్లాడింది రష్మిక. అయితే ఆమె యాస అటు పూర్తిగా తెలంగాణలా లేదు. ఇటు ఇతర యాసలా కూడా లేదు. దీంతో రాని యాస ట్రై చేయడం ఎందుకు అని కొంతమంది విమర్శిస్తున్నారు. మరికొందరు అయితే.. ఏళ్ల తరబడి తెలుగులో ఉండి, తెలుగు హీరోలను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు కూడా సరైన తెలుగు మాట్లాడని ఈ రోజుల్లో రష్మిక చేసిన ప్రయత్నం ప్రశంసనీయం అని మెచ్చుకుంటున్నారు..!!
