in

malavika mohanan did a terrifying 60 foot free-fall stunt!

మిళ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’లో హీరోయిన్‌గా నటిస్తున్న మాళవిక మోహనన్, ఈ సినిమా కోసం తాను చేసిన ఒక రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సోషల్ మీడియాలో అభిమానులతో జరిపిన ఇంటరాక్షన్‌లో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సుమారు 60 అడుగుల ఎత్తు నుండి తాడు సాయంతో కిందకి దూకే స్టంట్ చేసినట్లు ఆమె తెలిపింది..

గాలిలో పడిపోతున్న విమానం నుంచి కిందకి దూకుతున్నట్లుగా ఈ సీన్ డిజైన్ చేశారని, ఆ సమయంలో తన చుట్టూ భారీ బ్లోయర్ల ద్వారా విపరీతమైన గాలిని వీచేలా చేశారని మాళవిక పేర్కొంది. కేవలం స్టంట్ చేయడమే కాకుండా, అంత ఎత్తులో భయంతో కేకలు వేయకుండా బాడీ పోశ్చర్ మేనేజ్ చేస్తూ డైలాగులు చెప్పడం చాలా సవాలుగా అనిపించిందని ఆమె తెలిపింది. PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో మాళవిక ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి..!!

Anaswara rajan’s First Look: Heart Of Kaaka

3 ₹200 crore-plus grossers in a single calendar year for mamitha baiju!