in

allu arjun following the profit-sharing model for ‘raaka’!

కాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ కొత్త వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం బన్నీ తీసుకోబోయే రెమ్యునరేషన్ విషయంలో ‘పుష్ప’ చిత్ర ఫార్ములాను ఫాలో అవుతున్నాడట. ‘పుష్ప 1’, ‘పుష్ప 2’ చిత్రాల హ్యూజ్ సక్సెస్‌తో తన మార్కెట్ స్టామినాను పదింతలు పెంచుకున్న బన్నీ..

పుష్ప 2కి లాభాల్లో వాటా రూపంలో దాదాపు రూ.130 కోట్ల వరకు అందుకున్నట్లు సమాచారం. ఇప్పుడు అదే వ్యూహాన్ని ‘రాకా’ సినిమాకు కూడా వర్తింపజేస్తూ, ఈ చిత్రం యొక్క మొత్తం బిజినెస్‌లో 33 శాతం వాటాను ఒప్పందంగా చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘రాకా’పై భారీ అంచనాల దృష్ట్యా ఈ వాటా విలువ దాదాపు రూ.300 కోట్ల వరకు ఉండవచ్చని లెక్కగడుతున్నారు. అదే నిజమైతే, సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకునే నటుడిగా అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది..!!

lenin girl Bhagyashri Borse’s big launch in Malayalam!

Shahid Kapoor, Alia Bhatt To Join Jr NTR-Starrer Dragon?