in

private jet and luxury cars, nayanthara’s inspiring journey!

టీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో నయనతార తన సినీ ప్రయాణం తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, ఒక మ్యాగజైన్ కవర్ షూట్ కోసం మొదటిసారి పనిచేశారు. ఆ ఫ్యాషన్ ప్రోగ్రామ్ కోసం ఆమెకు అప్పట్లో కేవలం రూ. 2 వేలు నుంచి రూ. 3 వేలు వరకు పారితోషికం దక్కిందని ఆమె వెల్లడించారు. ఆ చిన్న మొత్తంతో ప్రారంభమైన ఆమె ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు కోట్ల రూపాయలు తీసుకునే స్థాయికి చేరింది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు సుమారు రూ. 5 కోట్లు నుంచి రూ. 10 కోట్లు వరకు డిమాండ్ చేస్తున్నారు.

సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా నయనతారకు భారీగా ఆదాయం వస్తోంది. ఒక్కో యాడ్ కోసం ఆమె రూ. 5 కోట్లు వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలోని అత్యంత ఖరీదైన పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఆమెకు సుమారు 16,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక విలాసవంతమైన బంగ్లా ఉందని జాతీయ మీడియా ఓ కథనంలో తెలిపింది. అలాగే ప్రైవేట్ జెట్ కూడా ఆమె సొంతం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇలా ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార మొత్తం నెట్ వర్త్ సుమారు రూ. 200 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూ. 2 వేలుతో మొదలైన ఆమె ప్రయాణం రూ. 200 కోట్లు స్థాయికి చేరడం నిజంగా అద్భుతమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..!!

Rashmika taken the No. 1 spot in India Today’s Mood of the Nation poll!

suriya to romance dc beauty Wamiqa Gabbi!