in

Rashmika taken the No. 1 spot in India Today’s Mood of the Nation poll!

న్నడ చిత్రసీమ నుంచి ప్రయాణం మొదలుపెట్టి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక మందన్న, తాజాగా దేశంలోనే నంబర్ 1 హీరోయిన్‌గా నిలిచారు. ఇటీవల వెలువడిన జాతీయ స్థాయి పాప్యులారిటీ ర్యాంకింగ్‌లో, బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొణెను వెనక్కి నెట్టి రష్మిక ఈ ఘనత సాధించినట్లు తెలుస్తోంది. ఇది ఆమె కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది.

‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘యానిమల్’ సినిమాతో హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇటీవల విడుదలైన ‘పుష్ప 2: ది రూల్’ ఆమె మాస్ ఇమేజ్‌ను, క్రేజ్‌ను శిఖర స్థాయికి చేర్చింది. దీంతో పాటు ‘ఛావా’, ‘కుబేర’ వంటి విభిన్న భాషల చిత్రాలతో తన నటనను, ఉనికిని అన్ని పరిశ్రమలలోనూ బలంగా చాటుకున్నారు..!!

aishwarya rajesh onboard for nagarjuna’s King100!

private jet and luxury cars, nayanthara’s inspiring journey!