in

malavika mohanan daring 100-150 meter jump stunt!

హీరో కార్తి నటిస్తున్న స్పై థ్రిల్లర్ ‘సర్దార్ 2’ సెట్స్‌లో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని నటి మాళవిక మోహనన్ పంచుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ మొదటి రోజే ఓ భారీ యాక్షన్ సీన్‌లో పాల్గొనాల్సి వచ్చిందని, అది తనను తీవ్రంగా భయపెట్టిందని ఆమె తెలిపారు. ‘సర్దార్ 2’ ఆడియో విడుదల కార్యక్రమంలో ఆమె ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన అనుభవాన్ని వివరిస్తూ, “నాకు షూటింగ్ మొదటి రోజే పెద్ద షాక్ తగిలింది. తొలిరోజే ఒక స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరించారు. అందులో భాగంగా నేను దాదాపు 100 నుంచి 150 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకాల్సి వచ్చింది. రోప్స్ వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, అంత ఎత్తు నుంచి ఫ్రీ ఫాల్ జంప్ చేయడం చాలా భయమేసింది. నా కెరీర్‌లో ఏ సినిమా సెట్‌లోనూ ఇంత భయానకమైన మొదటి రోజును నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు” అని మాళవిక అన్నారు..!!

Ravi Teja’s First Attempt of this new Genre!

Ram Charan to play Lord Krishna in Telugu remake of Gujarati film?