in

Kriti Sanon’s Rakhi Ad Pulled down amid controversy!

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘జీవ’ తన రక్షాబంధన్ వాణిజ్య ప్రకటనను అన్ని మీడియా వేదికల నుంచి ఉపసంహరించుకుంది. బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఈ యాడ్‌లో ఆమె ధరించిన దుస్తులు, ప్రచార కాన్సెప్ట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై ‘జీవ’ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని సంస్థ పేర్కొంది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడంతో పాటు..

పెంపుడు జంతువులతోనూ ఆ అనుబంధాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారాన్ని రూపొందించినట్లు వివరించింది. అయితే, ఇది అనుకోకుండా కొందరి మనోభావాలను దెబ్బతీసిందని అంగీకరించింది. అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ సదరు ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. సుమారు 36 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కృతి సనన్, బ్రాలెట్ తరహా బ్లౌజ్‌తో కూడిన ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించారు. తన సోదరుడికి, ఒక పెంపుడు శునకానికి ఆమె రాఖీ కడుతున్నట్లు అందులో చూపించారు. ఆమె వస్తధారణతో పాటు, రక్షాబంధన్ సంప్రదాయంలో పెంపుడు జంతువును భాగం చేయడంపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి..!!

Pregnant Samantha doing the TRX workout!

sandeep reddy opens up about spirit and varanasi release clash!