in

spirit producer reveals about deepika padukone’s sudden exit!

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం ఇప్పటికే పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఈ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. దీపిక రెమ్యునరేషన్, పని గంటలతో పాటు సినిమా లాభాల్లో వాటా కూడా అడిగారని ఆయన ఆరోపించారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ..దీపికా పదుకొణె సినిమా లాభాల్లో 10 శాతం వాటా కోరారని చెప్పారు. ఆమె ఏదైనా డిమాండ్ చేయవచ్చని..

అయితే సినిమా బడ్జెట్‌కు ఆ డిమాండ్ సరిపోవాలని అన్నారు. ఆర్థికంగా లెక్కలు సరిపోకపోవడంతో ఇతర ఆప్షన్ల కోసం వెతికామని తెలిపారు. దీపికతో సందీప్ సుమారు 18 నెలల పాటు మాట్లాడారని ప్రణయ్ తెలిపారు. సినిమా కథ, పాత్రకు సంబంధించిన వివరాలను ఆమెతో చర్చించామని చెప్పారు. అయితే తమ మధ్య అంతర్గతంగా జరిగిన చర్చలు బయటకు వెళ్లడంతో తాము అసంతృప్తికి గురయ్యామని ప్రణయ్ ఆరోపించారు. దీపికను మార్చడానికి ప్రధాన కారణాల్లో రెమ్యునరేషన్, పని వేళలు ఉన్నాయని ప్రణయ్ చెప్పారు. ఇది కేవలం అదనంగా రూ.5-6 కోట్లు అడిగిన వ్యవహారం కాదని స్పష్టం చేశారు..!!

mohan lal’s Drishyam 4 is officially confirmed!

‘irumudi’ becomes the Biggest Career Opener for ravi teja!