in

mohan lal’s Drishyam 4 is officially confirmed!

భారతీయ సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్‌గా నిలిచిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ అభిమానులకు ఓ అదిరిపోయే శుభవార్త. ఈ ఉత్కంఠభరిత కథను కొనసాగిస్తూ ‘దృశ్యం 4′ రాబోతోందని చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో జార్జ్‌కుట్టి అనే ఐకానిక్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయమైంది..’దృశ్యం’,  2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

ఈ చిత్రాల స్ఫూర్తితోనే కథను మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈ ఫ్రాంచైజీ సృష్టికర్త, టాలెంటెడ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ నాలుగో భాగానికి కూడా దర్శకత్వం వహించనుండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబ పెద్ద అయిన జార్జ్‌కుట్టి, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పన్నిన వ్యూహాలు ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేశాయి. ఇప్పుడు ‘దృశ్యం 4’లో జార్జ్‌కుట్టి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..!!

happy birthday chiranjeevi!

spirit producer reveals about deepika padukone’s sudden exit!