in

shivangi joshi was allegedly abused as a child!

రియాలిటీ షోలు కేవలం వినోదాన్నే కాకుండా, సెలబ్రిటీల జీవితాల్లోని దాగున్న చీకటి కోణాలను, అత్యంత బాధాకరమైన నిజాలను కూడా బయటపెడుతుంటాయి. తాజాగా ప్రముఖ నటి శివాంగి జోషి పాపులర్ రియాలిటీ షో ‘లాకప్ 2’ వేదికగా తన చిన్ననాటి బాల్యం తాలూకు భయానక జ్ఞాపకాలను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నమ్మిన బంధువే తనపై ఎలా అఘాయిత్యానికి యత్నించారనే విషయాన్ని కన్నీటిపర్యూరంగా పంచుకున్నారు. షోలో భాగంగా శివాంగి మాట్లాడుతూ..తన చిన్నతనంలో జరిగిన దారుణాన్ని బయటపెట్టారు..

మావయ్య వరుస అయ్యే ఒక వ్యక్తి ప్రతిరోజూ తనను స్కూల్ నుంచి తీసుకువచ్చేవాడని, తమ కుటుంబం అతడిని ఎంతో గుడ్డిగా నమ్మిందని తెలిపారు. అయితే ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ఆ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇండస్ట్రీలోకి వెళ్లాలంటే డ్రైవింగ్ నేర్చుకోవాలని, ఏవేవో మాట్లాడాలని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మానసికంగా వేధించేవాడని వాపోయారు. అసలు ఏం జరుగుతుందో, ఆ వ్యక్తి ఉద్దేశం ఏమిటో ఆ చిన్న వయసులో తనకు అర్థం కాలేదని తెలిపారు. ముఖ్యంగా అమ్మానాన్న ఇంట్లో లేని సమయాన్ని చూసి అతడు లైంగిక వేధింపులకు పాల్పడే ప్రయత్నం చేశాడని కన్నీరుమున్నీరయ్యారు..!!

dimple hayathi gets her 3rd chance with telugu hero!