in

Finally, trivikram and ntr ‘God of War’ Announced!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ భారీ మైథలాజికల్ చిత్రం రానుందనే వార్త గతకొంత కాలంగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందనే విషయం మాత్రం ఖాయమనే సంకేతాలు అందాయి. ఇప్పుడు ఈ వార్తను నిజం చేస్తూ మేకర్స్ ఈ కాంబోపై అధికారిక ప్రకటన చేశారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మైథలాజికల్ అంశాలతో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఓ థీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు..

ఈ పోస్టర్‌కు ‘‘శివుడి కుమారుడు, పార్వతి గర్వకారకుడు సుబ్రహ్మణ్య స్వామి’’ అనే క్యాప్షన్‌తో ఆయుధం ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేగాక, సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఈ పోస్టర్‌లో మనకు కనిపిస్తుంది. పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో యుద్ధం తర్వాత కనిపించే సన్నివేశం మనకు కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా పూర్తి మైథాలజీ నేపథ్యంలో సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండటం విశేషం..!!

f cube ‘naresh’!

etv prabhakar daughter Divija Makes Her Heroine Debut!