
విడుదలైన మొదటి రోజు నుండే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్రబృందం వైజాగ్‌లో ఒక భారీ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో వైజాగ్ నగరం సందడిగా మారింది. సక్సెస్ మీట్ వేదికపై ఈ సినిమా రచయిత, సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాకు సీక్వెల్ కావాలా? అని ఆయన ప్రేక్షకులను అడిగినప్పుడు, అభిమానుల నుండి వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది..
వారి ఉత్సాహాన్ని చూసి, రాజ్ నిడిమోరు ‘మా ఇంటి బంగారం’ రెండవ భాగం రాబోతోందని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాజ్ మాట్లాడుతూ, “నా మనసులో ఇప్పటికే ఒక ఆలోచన ఉంది. మొదటి భాగం రూపొందించిన అదే బృందం రెండవ భాగం కోసం కూడా పనిచేస్తుంది. నా సినీ కెరీర్లో ఒక చిత్రానికి కొనసాగింపు చేయాలని నాకు ఇంతగా అనిపించడం ఇదే మొదటిసారి. ఈ రెండో భాగం ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని, రెట్టింపు ఉత్సాహాన్ని అందిస్తుంది. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాను” అని ఆయన పేర్కొన్నారు..!!
