in

Disha Patani on trolls: I don’t care anymore

దిశా పటానీకి సోషల్‌ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఫిట్‌నెస్‌ వీడియోలు, ఫ్యాషన్‌ ఫొటోషూట్‌లు నిమిషాల్లో వైరల్‌ అవుతుంటాయి. యువతలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్‌ కారణంగా అనేక అంతర్జాతీయ బ్రాండ్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అయితే, ఈ క్రేజ్‌తోపాటు ఆమెపై తరచూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌, బాడీషేమింగ్‌ కామెంట్లు కూడా వస్తుంటాయి. ఆమె వేసుకునే దుస్తులపై, చేసే ఫొటో షూట్లపై కొందరు నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తుంటారు..

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై చాలా స్పష్టంగా మాట్లాడింది. ‘‘ఒకరిని దూరం నుంచి చూసి జడ్జ్‌ చేయడం చాలా సులభం. గతంలో నేను ఇతరుల అంచనాలకు తగ్గట్టు ఉండాలని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ తాపత్రయాన్ని వదిలేశాను. నా గురించి ప్రజలు ఏమనుకున్నా పర్లేదు. నా అంతరాత్మకు నచ్చినట్టు, నూటికి నూరుశాతం నిజాయతీగా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తాను’’ అని చెప్పుకొచ్చింది. నెగెటివిటీని సానుకూలంగా ఎదుర్కోవడంలో ఆమె చూపించే పరిణతి, మానసిక ధైర్యం నేటి యువతకు స్ఫూర్తినిస్తోంది..!!

Rajinikanth about the controversies surrounding his silence!

beauty Bhagyashri Borse becomes talk of the town!