in

swasika turned down the massive pan-Indian project peddi!

లయాళ, తమిళ సినీ ఇండస్ట్రీల్లో సక్సెస్‌ఫుల్ నటిగా కొనసాగుతున్న హీరోయిన్ శ్వాసిక..అందంతో పాటు నేచురల్‌గా పలికించే హావభావాలతో ఆమె ఎంతో ఫేమస్ అయ్యింది. అదే విధంగా తన అందాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ‘పెద్ది’ సినిమాలో నటించే అవకాశాన్ని తిరస్కరించిందట. అయితే ఆమెను చిత్రబృందం సంప్రదించింది హీరోయిన్ పాత్ర కోసం కాదు. హీరో రామ్‌చరణ్ తల్లి పాత్ర కోసం ఆమె దగ్గరకి వెళ్లారట.

‘పెద్ది’ సినిమాలో నటించే ఛాన్స్ అంటే నటి శ్వాసిక ఎంతో సంతోషించిదట. చిన్న పాత్ర అయినా పర్లేదు చేసేందుకు వెనుకాడను అని చెప్పిందట. అయితే ఈ సినిమాలో రామ్‌చరణ్ తల్లి పాత్రలో నటించాలని చిత్రబృందం చెప్పేసరికి ఆ అవకాశాన్ని వద్దని అనుకున్నారట. 34 ఏళ్ల వయసులో తల్లి పాత్రలు చేయడం ఇష్టం లేదని ఆమె ఈ సినిమాలో నటించే అవకాశాన్ని తిరస్కరించింద. తమిళ మూవీ ‘లబ్బర్ పందు’లో హీరోయిన్‌ తల్లిగా నటించిన కారణంగా ఆమెకు ఇప్పటికీ తల్లి రోల్స్ వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో తల్లి పాత్రలను రిజెక్ట్ చేస్తున్నట్లు చెప్పింది..!!

Film body revokes ban on Ranveer Singh!