
కాంతార చాప్టర్-2′ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి రుక్మిణి వసంత్ నకిలీ వీడియోల వ్యవహారంలో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆమె ఫేక్ బికినీ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న 29 ఖాతాలపై నేడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు నటి రుక్మిణి వసంత్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు..
AI, డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి వేరొకరి శరీరానికి తన ముఖాన్ని అతికించి, ఫేక్ విజువల్స్ సృష్టించారని రుక్మిణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్య తనను తీవ్ర ఇబ్బందికి గురిచేసిందని, ఉద్దేశపూర్వకంగా తన క్యారెక్టర్, ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఇలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నటి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, 9 ఇన్‌స్టాగ్రామ్, 14 X, 6 ఫేస్‌బుక్ పేజీలతో సహా మొత్తం 29 ఖాతాలను గుర్తించి కేసు నమోదు చేశారు..!!

