in

janhvi Kapoor reveals big difference between tollywood and Bollywood!

టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల పని సంస్కృతిపై నటి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా సెట్స్‌లో ఇచ్చే గౌరవం, అక్కడి వాతావరణం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటించిన జాన్వీ రెండు పరిశ్రమల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను పంచుకున్నారు..తెలుగు చలనచిత్ర పరిశ్రమ పూర్తిగా సినిమాపై ఉన్న ఇష్టం, పట్టుదలతో నడుస్తుందని జాన్వీ అభిప్రాయపడ్డారు..

మంచి సినిమా తీయడం కోసమే ఇక్కడి దర్శకులు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. అవసరమైతే నిర్మాణ సమయాన్ని పొడిగిస్తారని పేర్కొన్నారు. షూటింగ్ షెడ్యూల్స్ కంటే సృజనాత్మకతకే ఎక్కువ విలువ ఉంటుందని వివరించారు. హిందీ పరిశ్రమలో మాత్రం అంతా పక్కా ప్రణాళిక, గడువుల ప్రకారం జరుగుతుందని చెప్పారు. బాలీవుడ్‌లో సమయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొన్నిసార్లు కథ విషయంలో రాజీ పడాల్సి వస్తుందని వివరించారు..!!

Fake bikini photos Rukmini Vasanth

Fake Bikini Photos: FIR Against 29 Accounts Over Rukmini Vasanth

struggling beauty Krithi Shetty responds on iron leg trollings!