
ప్రభాస్ ప్రస్తుతం సినిమాలతో పాటు తన డ్రీమ్ హౌస్ నిర్మాణంతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో ఆయన అత్యంత విలాసవంతమైన భారీ మాన్షన్ నిర్మిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండేళ్ల క్రితం కోకాపేట ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో ప్రభాస్ 80 CR భారీ ధరకు కొన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపించింది..
ప్రస్తుతం అదే ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో భారీ ప్యాలెస్ తరహా ఇంటి నిర్మాణం జరుగుతోందని ప్రచారం సాగుతోంది..భూమి కొనుగోలుకే వందల కోట్లు ఖర్చు చేసిన ప్రభాస్..ఇప్పుడు ఈ మాన్షన్ నిర్మాణం కోసం దాదాపు రూ.300 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఇంటిని అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు డిజైన్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో చిరంజీవి నివాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..!!
