in

Sara Ali Khan prioritises self growth over rushing into marriage!

న వ్యక్తిగత జీవితంలో, చుట్టుపక్కల కొన్ని పెళ్లి బంధాలు విఫలమై విడిపోవడాన్ని కళ్లారా చూసిన సారా, వివాహం అనే వ్యవస్థను కేవలం ఊహల్లో చూసి తేలిపోనని స్పష్టం చేశారు. మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ చూసే సంఘటనల నుంచే మన ఆలోచనలు పుడతాయని పేర్కొంటూ, హడావుడిగా పెళ్లి చేసుకుని బాధపడే కంటే కాస్త సమయం తీసుకుని సరైన వ్యక్తి దొరికే వరకు వేచి చూడటం ఎంతో ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు..

ఒకవేళ తన జీవితంలోకి సరైన భాగస్వామి దొరకకపోతే, ఎవరికోసం తనను తాను మార్చుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండటానికైనా సిద్ధమేనని సారా తెగేసి చెప్పారు. నన్ను ఎవరో వచ్చి సంపూర్ణురాలిగా చేయాల్సిన అవసరం లేదని, ఒక సంపూర్ణమైన మనిషిగా సొంతంగా ఎదగడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని సారా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తనకంటూ ఉన్న ప్రత్యేక గుర్తింపును గౌరవిస్తూ, తన సంతోషాన్ని పంచుకునే వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెబుతూ, ప్రస్తుతానికి మాత్రం తన పూర్తి దృష్టి కేవలం కెరీర్, సొంత ఎదుగుదల, సినిమాలపైనే ఉందని ఆమె క్లారిటీ ఇచ్చారు..!!

Rashmika reveals about her tattoo ‘irreplaceable’!

NBK111: Manchu Manoj joins Nandamuri Balakrishna’s film