in

Rashmika Accidentally Drops The ‘F Word’ While Praising Kriti Sanon!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన హాట్ లుక్స్, గ్లామర్ షో, సినిమాల కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఇటీవల ఆమె విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోవడంతో ఆమె సినిమా ఇంస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, వివాదాలకు దూరంగా ఉండే రష్మిక, తాజాగా ఆమె నోటి నుంచి వచ్చిన ఓ మాటతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడింది. రష్మిక బాలీవుడ్‌లో నటిస్తు్న్న లేటెస్ట్ చిత్రం ‘కాక్‌టైల్-2’ ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ ఈవెంట్‌లో షాహిద్ కపూర్, కృతి సనన్ కూడా పాల్గొన్నారు..

అయితే, తన తోటి హీరోయిన్ కృతి సనన్ గురించి మాట్లాడుతూ రష్మిక ఓ పదాన్ని నోరు జారింది. కృతి హాట్‌గా ఉంటుందని..నిజానికి ‘ఫ..గ్ హాట్’ అంటూ రష్మిక స్టేజీపై కామెంట్ చేసింది. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న రష్మిక, ఆ మాటను సెన్సార్ చేయాలంటూ అక్కడున్న మీడియాను కోరింది. అయితే, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో రష్మికపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెలబ్రిటీలు స్టేజీపై ఏం ఇలాంటి పదాలు వాడటం ఏమాత్రం బాగుండదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..!!

Sreeleela and cricketer Tilak Varma in a relationship?

f cube ‘Rukmini Vasanth’!