
ప్రముఖ నటి సమంత తన కెరీర్ పంథాపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఇకపై తాను నటించే చిత్రాల్లో కథే ప్రధాన హీరో అని, కంటెంట్‌కే తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని తేల్చిచెప్పారు. ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాబోయే ప్రాజెక్టులలో హీరో ఎవరని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, “ఇకపై నేను అలాంటి సినిమాలు చేయడం లేదు” అని సమాధానమిచ్చారు..
ఈ సందర్భంగా తన ఫిలిం ఫిలాసఫీని వివరిస్తూ, “నేను చేసే సినిమాల్లో కథే హీరో అవుతుంది. కథ అనేది నిర్మాత, నటీనటుల కంటే గొప్పది” అని సమంత స్పష్టం చేశారు. మహిళా ప్రేక్షకులు తాము చూసే పాత్రలతో మమేకమయ్యేలా, తమను తాము ఆ పాత్రల్లో చూసుకునేలా ఉండే చిత్రాలు చేయడమే తన లక్ష్యమని ఆమె వివరించారు. ఇదే ఆలోచనతో ఆమె ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆమె నిర్మిస్తున్న తొలి చిత్రం ‘మా ఇంటి బంగారం’.!!

