in

ashu reddy cheating case: high court rejects her petition

లండన్‌లో ఉంటున్న తన కుమారుడు వై.వి.ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అషురెడ్డి, ఆమె తల్లి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసం చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వై. సత్యనారాయణమూర్తి హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి పేరుతో ఎన్నారై వ్యాపారవేత్తను మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన క్రిమినల్ కేసులో సినీ నటి అషురెడ్డికి  తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది..

తన పైనా, తన తల్లి యశోదరెడ్డిపైనా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని, దర్యాప్తును నిలిపివేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కఠిన చర్యలు తీసుకోకుండా మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. సుమారు రూ.10.5 కోట్ల నగదు బదిలీ ఆన్‌లైన్‌లోనే జరిగిందని, దర్యాప్తు కొనసాగించాల్సి ఉందని కోర్టుకు వివరించారు. ఇప్పటికే పిటిషనర్‌కు 41ఏ నోటీసులు జారీ చేశామని కూడా పేర్కొన్నారు..!!

Mrunal Thakur in Talks for Venu Yeldandi’s Yellamma!

Jet Lee!