
ఈనెల 15న సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ విడుదల కావాల్సివుంది. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘ఓ బేబీ’ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి, సమంత సోలో లీడ్ కాబట్టి, తన భర్త నిర్మాతగా మారాడు కాబట్టి..కచ్చితంగా ఈ సినిమాపై ఫోకస్ ఉంటుంది. దానికి తోడు ప్రమోషన్లూ గట్టిగానే చేయాలని భావించింది సమంత. అయితే..సడన్ గా ఎందుకో బంగారం మెరవడం మానేసింది. 15న రిలీజ్ పెట్టుకొని ఇంకా ఎలాంటి హడావుడి చేయడం లేదు..
ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం సినిమా వాయిదా పడుతుందన్న వార్తలు గట్టిగా వినిపించడం మొదలెట్టాయి. అందుకే..ప్రమోషన్లు చేయడం లేదని తెలుస్తోంది. ‘టాక్సిక్’ జూన్ 4న రావాల్సివుంది. కానీ వాయిదా పడింది. దాంతో ‘మా ఇంటి బంగారం’ జూన్ 4 తేదీని టార్గెట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ డేట్ ‘పెద్ది’ బ్లాక్ చేసింది. సో సమంతకు ఛాన్స్ లేనట్టే. జూన్ 26న ‘లెనిన్’ తో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిల్ తో సమంత సినిమా పోటీ పడడం కొంత వరకూ మార్కెట్ పరంగా ఆసక్తి రేకెత్తిస్తుంది..!!
