in

balayya to play chief minister in koratala siva’s film!

నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కలయికలో సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న #NBK112 గురించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో సామాజిక బాధ్యతతో కూడిన బలమైన సందేశం ఉంటుంది. అయితే బాలయ్య బాబు ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈసారి కొరటాల ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది..

గతంలో ‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేష్ బాబును ఒక సాఫ్ట్ అండ్ స్టైలిష్ ముఖ్యమంత్రిగా చూపించిన కొరటాల, ఈ సినిమాలో బాలకృష్ణను ఒక మాస్ సీఎంగా ప్రెజెంట్ చేయబోతున్నారట. ప్రజా క్షేమం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే, ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే ధీటైన నాయకుడిగా బాలయ్య పాత్ర ఉండబోతుందని సమాచారం. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అనే బిరుదుకు న్యాయం చేస్తూ, వెండితెరపై ఆయన రాజసం ఉట్టిపడేలా ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు వినికిడి..!!

good news: Prabhas Joins Kalki 2 Shoot confirms director

Samantha’s telugu comeback film lacks hype and buzz!