
విజయ్, కృతి సనన్ కలిసి ఓ బైలింగ్వల్ చిత్రంలో నటించే అవకాశంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. హాయ్ నాన్న దర్శకుడు శౌర్య తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌కు అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది..
కథ విన్న కృతి సనన్ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ–కృతి సనన్ కాంబినేషన్ కొత్తగా ఉండబోతుండటంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరుగుతోంది. ఈ జంట తెరపై కనిపిస్తే కొత్త కెమిస్ట్రీని అందించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానప్పటికీ, అన్ని అంశాలు కుదిరితే ఇది పాన్-ఇండియా స్థాయిలో మంచి ఆకర్షణగా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది..!!

