in

Boyapati Srinu Teams Up With Karthi After Akhanda 2!

ఖండ 2 తర్వాత బోయపాటి శ్రీను తొలుత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ప్రయత్నించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు బ్లాక్‌బస్టర్ కావడంతో మళ్లీ అటువంటి సినిమా వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత బోయపాటి ఒక బాలీవుడ్ హీరోతో సినిమా చేయబోతున్నారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తల్లో కూడా వాస్తవం లేదని తేలిపోయింది..

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం..విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన కార్తీపై బోయపాటి ఆసక్తి చూపిస్తున్నారు. కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉండటం, ఆయన నటనలో ఉన్న వైవిధ్యం బోయపాటిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కార్తీ ఇమేజ్‌కు తోడైతే ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కాంబినేషన్ కుదిరితే మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బోయపాటి సాఫ్ట్, సీరియస్ రోల్స్‌ను అద్భుతంగా పండించే కార్తీ కోసం ఎటువంటి కథను డిజైన్ చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది..!!

Sai Pallavi’s Bollywood debut ‘Ek Din’ gets a weak opening!