
నందమూరి బాలకృష్ణ తన జోరును కొనసాగిస్తున్నారు. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆయన, తన తదుపరి చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న బాలకృష్ణ, ఆ తర్వాత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో పనిచేయబోతున్నారు. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది..
సినీ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలకృష్ణ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఖరారైంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి యువ దర్శకుల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ, కొరటాల శివ వినిపించిన కథాంశానికి బాలయ్య పూర్తిస్థాయిలో కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది..!!

