
ప్రస్తుతం బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ సరసన ‘రామాయణ’ చిత్రంలో సీతగా నటిస్తూ బిజీగా ఉంది. అయితే, కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా, గతంలో తాను చేసిన ఒక వ్యాఖ్యను కొందరు వక్రీకరించడంపై తాజాగా ఆమె స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఏం జరిగిందంటే..దాదాపు నాలుగేళ్ల క్రితం ఒక ప్రెస్ మీట్‌లో, “మీరు మలయాళీలు అయి ఉండి తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు?” అని ఒక రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి సాయి పల్లవి సమాధానమిస్తూ..
“నేను తమిళ అమ్మాయిని, మలయాళీని కాదు” అని స్పష్టం చేసింది. అయితే, రెండేళ్ల తర్వాత కొందరు ఈ మాటలను వక్రీకరించి, “మలయాళీ అని పిలిచినందుకు సాయి పల్లవికి కోపం వచ్చింది” అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఈ ప్రచారంపై తాజాగా ఆమె స్పందిస్తూ..”ఆ హెడ్‌లైన్ చూసి నేను షాక్‌కు గురయ్యాను. నేను అనని మాటలను నాపై మోపడం బాధాకరం. నేను కోయంబత్తూరులో పుట్టి పెరిగాను, నా మాతృభాష తమిళం అని మాత్రమే చెప్పాను. ఏ భాషను తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు” అని సాయి పల్లవి వివరణ ఇచ్చింది..!!

