in

Shahid Kapoor to play antagonist in Jr NTR’s ‘Dragon’?

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా ‘డ్రాగన్’ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. సహజంగానే ప్రశాంత్ నీల్ సినిమాల్లో విలన్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే, మొదట ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌ ను సంప్రదించారు. కానీ, కుదరలేదు. ఇప్పుడు ఈ పవర్‌ ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ను సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. మరి షాహిద్ విలన్ పాత్రలో ఒప్పుకుంటాడా.. ఒకవేళ ఒప్పుకుంటే సినిమా పై అంచనాలు ఇంకా తారాస్థాయికి చేరుకుంటాయి..

భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది..!!

pooja hegde taking a strategic step regarding her carrier?