in

Allu Arjun risky experiment with his upcoming film Raaka!

కాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక లభించింది. ఆయన, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రానికి ‘రాకా’ (RAAKA) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న ఊహాగానాలకు తెరదించుతూ, చిత్ర యూనిట్ అధికారికంగా ఈ ప్రకటన చేసింది..

ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ కనపడని అనూహ్యమైన రూపంలో దర్శనమిచ్చారు. గుండుతో, ఒంటిపై ప్రత్యేకమైన గుర్తులు, చెవిపోగులతో భిన్నంగా కనిపిస్తున్నారు. ఓ క్రూర మృగం లాంటి చేయి ఆయన ముఖాన్ని కప్పి ఉంచడం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇది ఒక వింత జంతువు లేదా హైబ్రిడ్ జీవిని పోలి ఉండటంతో కథపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది..!!

Actress Krithi Shetty shares her breakup story!

good news for Jr NTR and Prashanth Neel’s film, producers clarity!