in

sai pallavi to play legendary actress Madhubala in an upcoming biopic?

డిఫరెంట్ రోల్స్‌లో నటిస్తూ తనదైన యాక్టింగ్, డ్యాన్స్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. తెలుగులో లాస్ట్‌గా తండేల్ మూవీలో నటించారు. ఇప్పుడు ‘ఏక్ దిన్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం నితీష్ తివారి ‘రామాయణ’ మూవీతో బిజీగా ఉన్న సాయి పల్లవి మరో బాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కించనున్న అలనాటి ప్రముఖ నటి మధుబాల బయోపిక్‌లో సాయి పల్లవిని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ బయోపిక్‌లో తొలుత హీరోయిన్లు కియారా అడ్వాణీ, అనీత్ పడ్డా పేర్లు వినిపించినప్పటికీ మధుబాల రోల్ కోసం సాయి పల్లవిని తీసుకుంటేనే బాగుంటుందని సంజయ్ భావిస్తున్నారట..!!

Bucchi babu planning a massive special song for ‘Peddi’!