
కీర్తి సురేశ్ ప్లానింగ్ కారణంగా తెలుగులో గ్యాప్ లేకుండా చేయలేకపోయింది. ‘దసరా’ తరువాత ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేకపోయింది. తమిళంలో మాత్రం ఆమె మార్కెట్ బాగానే ఉంది. తెలుగులో ఆమె ప్రాజెక్టులు..నిర్ణయాల విషయంలో అభిమానులు మాత్రం కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఆమె నుంచి సరైన సినిమా రాలేదనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె విజయ్ దేవరకొండ జోడిగా ‘రౌడీ జనార్దన’ సినిమాను ఒప్పేసుకుంది..
విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేశ్ తొలిసారిగా చేస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్టుకి ఒక్కసారిగా బజ్ వచ్చేసింది. తెరపై ఈ జోడీ చాలా బావుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. అటు విజయ్ దేవరకొండకి..ఇటు కీర్తి సురేశ్ కి కూడా ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ ఓ కీలకమైన పాత్రను చేయనున్నారని అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, డిసెంబర్లో థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు..!!

