in

Rashmika to play a villain Role In Allu Arjun atlee film!

పుష్ప’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి వీరిద్దరూ ప్రేమికులుగా కాదు.. ఒకరికొకరు సవాళ్లు విసురుకునే పాత్రల్లో కనిపించబోతున్నారన్న వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బహుభాషా చిత్రంలో రష్మిక ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం..ఈ సినిమాలో రష్మిక మందన్న ప్రతినాయిక (విలన్) ఛాయలున్న పాత్రలో కనిపించబోతోంది. తన కెరీర్‌లో ఇప్పటివరకు చూడని సరికొత్త కోణంలో ఆమె ఈ పాత్రను పోషిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల టాక్. తాజాగా ఆమె సెట్స్‌లోకి అడుగుపెట్టడంతో ఈ ప్రచారం మరింత బలపడింది..11

Meenakshi Chaudhary refutes stress, depression rumours!

Actress Jaya Vahini Passes Away After Cancer Battle!