
బాలీవుడ్ లో విడుదలైన ‘దురంధర్’ దుమ్ము దులిపేసింది. రూ.1000 కోట్లకు పైగానే ఈ సినిమా వసూళ్లు అందుకొంది. ఇప్పుడు ఓటీటీలోనూ విడుదలైంది. థియేటర్లో చూడని వాళ్లు సైతం..ఇప్పుడు ఓటీటీలో చూసి ‘మంచి సినిమా’ అంటూ మెచ్చుకొంటున్నారు. ఈ సినిమాలోని నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా చేసిన రెహమాన్ డెకాయిట్ పాత్ర అయితే బ్లాస్ట్ లా పేలింది..
రెహమాన్ గా అక్షయ్ ఆహార్యం, అభినయం బాగా నచ్చాయి. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా నాగార్జునను సంప్రదించినట్టు సమాచారం. అయితే నాగ్ ఒప్పుకోలేదు. ఆ స్థానంలో ‘కూలీ’ సినిమాను ఒప్పుకొన్నారు. ‘కూలీ’ ఇచ్చిన రిజల్ట్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘దురంధర్’ విడుదలయ్యాక.. నాగ్ నిర్ణయం ఎంత తప్పయ్యిందో తెలిసొచ్చింది. నాగ్ ఈ సినిమాని వదిలేసి తప్పు చేశాడని ఆయన అభిమానులు కూడా బాధ పడుతున్నారు..!!

