in

Rajamouli confirms Varanasi will release as a single-part film!

గ 2 చేస్తాన‌ని చాలా సందర్భాల్లో చెప్పారు రాజ‌మౌళి. కానీ దాన్ని ఎప్పుడో పక్క‌న పెట్టేశారు. RRR కీ రెండో భాగం ఉంటుంది అనుకొన్నారు. కానీ రాజ‌మౌళి మాత్రం ఆ ఊసెత్త‌లేదు. ఇప్పుడు ‘వారణాసి’ కూడా సింగిల్ పార్టే. ఈసినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు ఆ వార్త‌ల‌కు రాజ‌మౌళి చెక్ పెట్టారు. ఈసినిమాని ఒక పార్ట్ గానే విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కాక‌పోతే రన్ టైమ్ మాత్రం 3 గంట‌లు..

రాజ‌మౌళి, మ‌హేష్ బాబు సినిమా 3 గంట‌లు తీస్తే..చూడ్డానికి ప్రేక్ష‌కులు రెడీనే. కాబ‌ట్టి ర‌న్ టైమ్ పెద్ద ఇబ్బంది కాదనే అనుకోవాలి. పార్ట్ 2, సీక్వెల్ అంటే చెప్పిన క‌థ‌నే మ‌రో కోణంలో చెప్ప‌డం. లేదంటే ఆ క్యారెక్ట‌ర్‌ని, ఆ క‌థ‌ని పొడిగించ‌డం. ఇవి రాజ‌మౌళికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయ‌న ద‌గ్గ‌ర చెప్పాల‌నుకొన్న క‌థ‌లు, చూపించాల‌నుకొన్న అద్భుతాలు చాలా ఉన్నాయి. సీక్వెల్ కి బ‌దులు ఓ కొత్త క‌థ చెప్ప‌డం ఎప్పుడూ బాగుంటుంది. రాజ‌మౌళి కూడా ఆ దిశ‌గానే ఆలోచిస్తున్నార‌నుకోవాలి..!!

deepika out, sai pallavi in for prabhas kalki 2?