
మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే జోష్‌తో తన 158వ ప్రాజెక్ట్ కోసం మళ్లీ ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ కొల్లితో జట్టు కట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది..
ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ఎంపికైనట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి నటించలేదు, కాబట్టి ఈ ‘ఫ్రెష్ జోడీ’ తెరపై ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో చిరు భార్యగా ప్రియమణి ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట. ఈ చిత్రంలో మెగాస్టార్ కూతురి పాత్ర చాలా కీలకమని, ఆ పాత్ర కోసం యంగ్ బ్యూటీ కృతి శెట్టిని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సీన్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి..!!
