in

Boyapati Srinu Bollywood Entry with Ranveer Singh!

రోసారి నందమూరి బాలకృష్ణతో సినిమా ఖరారైందన్న టాక్ సినీ ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుందని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాలు చూస్తే..ఆ కాంబినేషన్ ఇప్పట్లో సాధ్యపడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ భారీ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. దీంతో బోయపాటి–బాలయ్య ప్రాజెక్ట్ కొంతకాలం వాయిదా పడినట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను దృష్టి బాలీవుడ్‌పై పడిందన్న సమాచారం తెలుస్తోంది..

తాజా టాక్ ప్రకారం..బోయపాటి శ్రీను తన తదుపరి సినిమాను బాలీవుడ్ యంగ్ స్టార్ రణవీర్ సింగ్‌తో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఇటీవల ముంబై వెళ్లిన బోయపాటి.. రణవీర్‌కు ఒక పవర్‌ఫుల్ మాస్ కథను వినిపించినట్టు తెలుస్తోంది. రణవీర్ ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ సినిమాతో తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్‌ను షేక్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతుండగా.. సమ్మర్‌లో విడుదల కానున్న ‘ధురంధర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి..!!

rashmika shocking comments on social media fake news!

Tabu to romance Nagarjuna after a long wait!