
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంత టాలెంటెడ్ అనేది తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆన్ స్క్రీన్ దగ్గర తన నటనతో విజృంభిస్తాడు తారక్. అయితే తారక్ ఒక్క నటనే కాకుండా మంచి నృత్యకారుడు, అలాగే గాయకుడు కూడా ఇలా మరిన్ని ఇతర టాలెంట్స్ తనలో దాగి ఉండగా ఇవి కాకుండా అతనొక మ్యాడ్ డ్రైవర్ అంటూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రివీల్ చేసిన విషయం వైరల్ గా మారింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి ఒక పవర్ఫుల్ కార్ ఇస్తే ఏ కో స్టార్ తో డ్రైవ్ లో మీరు ప్యాసింజర్ సీట్ లో కూర్చుకుంటారు అనే మాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ పేరు చెప్పడం విశేషం. ఎన్టీఆర్ ఒక మ్యాడ్ డ్రైవర్ అని చాలామంది అతనితో ఎక్స్ పీరియన్స్ అయ్యిన వాళ్ళు కూడా తన డ్రైవింగ్ కోసం చెప్పారని తను తెలిపాడు. దీనితో తారక్ లో రకమైన టాలెంట్ కూడా ఉందా అని ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు..!!
