
తమిళంలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కార్తితో నటించిన ‘వా వాతియార్ సినిమా పదే పదే వాయిదా పడటంతో ఆమె తీవ్ర నిరాశకు గురయింది. ప్రదీప్ రంగనాథన్‌తో తెరకెక్కుతున్న LIK కూడా పోస్ట్‌పోన్ కావడంతో తన బ్యాడ్ లక్ కొనసాగుతోందని ఫీల్ అవుతుంది. అయితే, ఇలాంటి సమయంలో మరో హీరోయిన్ వచ్చి తనకు రావాల్సిన అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కృతి శెట్టి ముంబైలో కనిపించడంతో బాలీవుడ్ ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరిగింది..
నిజంగానే హిందీ సినిమాలో అవకాశం కోసం ఆమె ఆడిషన్స్‌కు హాజరైనట్లు సమాచారం. దీంతో ఈసారి బాలీవుడ్‌లో అదృష్టం కలిసి వస్తుందని అందరూ భావించారు. కానీ, చివరకు ఆ ప్రాజెక్ట్‌లోకి కృతి శెట్టికి బదులుగా కీర్తి సురేష్ ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. ‘బేబి జాన్’ సినిమాతో హిందీలో అడుగుపెట్టినప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ అయినా, ఇప్పుడు మరో బాలీవుడ్ అవకాశం దక్కించుకోవడం కీర్తి సురేష్‌కు లక్కీగా మారింది. తెలుగు, హిందీ రెండింట్లోనూ అవకాశాలు అందుకుంటూ కీర్తి సురేష్ దూసుకుపోతుండగా, కృతి శెట్టికి మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు..!!
