
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి తన అంతర్జాతీయ స్థాయి క్రేజ్‌ను రుచి చూశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఆమె నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ ప్రమోషన్ల కోసం ఇటీవల జపాన్ వెళ్లారు. అక్కడ అభిమానుల నుంచి లభించిన అపూర్వ ఆదరణకు ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. జనవరి 16న జపాన్‌లో ఈ చిత్రం విడుదలైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న రష్మికపై అక్కడి అభిమానులు ప్రేమ వర్షం కురిపించారు.
ఒక్కరోజు పర్యటన కోసం జపాన్ వెళ్లిన రష్మికను చూసేందుకు, ఆమెతో మాట్లాడేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు తమ అభిమానాన్ని చాటుకుంటూ అనేక బహుమతులు, లేఖలు అందించారు. ఊహించని ఈ అభిమానానికి రష్మిక తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ లేఖలు, బహుమతులను అక్కడే వదిలివేయడానికి మనస్కరించక, వాటన్నింటినీ భద్రంగా తనతో పాటు ఇంటికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక హృదయపూర్వక నోట్ పంచుకున్నారు..!!

