in

Bhagyashri Borse’s look from akhil’s ‘Lenin’ unveiled!

ఖిల్ హీరోగా, మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె ‘భారతి’ అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ పోస్టర్‌ను పంచుకుంది..

“లెనిన్ ప్రేమ..భారతిని పరిచయం చేస్తున్నాం” అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అంతేకాకుండా, సినిమా నుంచి మొదటి సింగిల్‌ను జనవరి 5న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టర్ ద్వారా 2026 వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. నిజానికి ఈ సినిమాలో కథానాయికగా మొదట శ్రీలీలను ఎంపిక చేశారు. అయితే, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు..!!

HAPPY BIRTHDAY BELLAMKONDA SRINIVAS!

Vijay Deverakonda's Kingdom 2 Shelved! Naga Vamsi Confirms

Vijay Deverakonda’s Kingdom 2 Shelved! Naga Vamsi Confirms