
లవ్ స్టోరీ స్పెషలిస్ట్ అయిన మణిరత్నం తన కథ కోసం క్రేజీ స్టార్స్ ని సెలక్ట్ చేసుకున్నట్లు టాక్, అవును విజయ్ సేతుపతి, సాయి పల్లవిలను మెయిన్ లీడ్స్ గా పెట్టి లవ్ స్టోరీ తీసేందుకు సిద్దపడుతున్నారని సమాచారం. ఈ న్యూస్ సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కారణం టాలెంటెడ్ యాక్టర్స్ ఇద్దరితో లెజండ్రీ దర్శకుడు మణిరత్నం లవ్ స్టోరీ తీస్తుండటమే. మణిరత్నం సినిమాల్లో హీరో, హీరోయిన్స్ రోల్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి..
మెయిన్ పాత్రలు సాఫ్ట్ గా ఉంటూ, బలమైన ఎమోషన్స్ పండిస్తాయి. విజయ్ సేతుపతి లాంటి డిఫరెంట్ నటుడు మణి రత్నం కథకి సరిపోతాడా ? అని సంశయం ఒక వైపు , ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే సేతుపతి మణిరత్నం కథలో ఎలా ఒదిగిపోతాడో చూడాలన్న ఆసక్తి ఇంకోవైపు నెలకొంది. హీరోయిన్ సాయి పల్లవి రూటే సెపరేటు. హీరో , దర్శకుడు, స్టార్స్ లెక్కలు వేసుకోకుండా కథ నచ్చితే ఓకే చెప్తుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అయితే కచ్చితంగా ఓకే చెప్తుంది..!!
