
విలక్షణమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటి అదా శర్మ తాను ఎదుర్కొన్న తీవ్రమైన బెదిరింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023లో విడుదలై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా తర్వాత దేశంలో సగం మంది తనను చంపాలని చూశారని ఆమె తాజాగా వెల్లడించారు. ఆ సమయంలో మిగతా సగం మంది తనకు మద్దతుగా నిలిచి కాపాడారని తెలిపారు..
ఈ విషయంపై అదా శర్మ మాట్లాడుతూ, ‘‘రిస్క్‌తో కూడిన పాత్రలు చేసినప్పుడే కెరీర్‌కు విలువ వస్తుంది. నేను ‘1920’ సినిమాతో పరిశ్రమలోకి వచ్చాను. నా తొలి చిత్రమే ఒక పెద్ద సాహసం. ‘ది కేరళ స్టోరీ’ వచ్చే వరకు మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూశాను. ఆ చిత్రం తర్వాత నా కెరీర్ పూర్తిగా మారిపోయింది. దాని తర్వాత నేను నటించిన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ చిత్రాల సమయంలోనూ తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొన్నాను. దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకుంటే, మిగతా సగం మంది నాపై ప్రశంసలు కురిపిస్తూ నన్ను రక్షించారు’’ అని అన్నారు..!!

