
పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా సైతం ఒకటి. ఇక..తాజాగా ప్రభాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా..సినిమా నుంచి ఆడియో అప్డేట్లు కూడా సందీప్ రిలీజ్ చేసి ఆడియన్స్‌లో హైప్ పెంచాడు. అయితే..సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..సందీప్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ లీడ్ రోల్లో నటిస్తున్న స్పిరిట్ సినిమాలో చిరంజీవి నటించట్లేదని వివరించాడు.
అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని.. తెల్చి చెప్పేసాడు. ప్రభాస్ తండ్రి రోల్ కానీ.. మరే ఇతర పాత్రలోనైనా.. చిరంజీవి నటించిన చిరుతో కలిసి వేరే సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. మరోవైపు స్పిరిట్ మూవీలో కొరియన్ యాక్టర్ డాన్లీ విలన్ పాత్ర పోషిస్తున్నాడని టాక్. దీనిపై మాత్రం సందీప్ రియాక్ట్ కాకపోవడంతో.. ఇందులో డార్లింగ్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక.. స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ తన కెరీర్లో మొదటిసారి ఓ పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నాడు.!!

