ప్రభాస్ చేతిలో ఫౌజీ ఉంది. రాజాసాబ్ పని దాదాపుగా పూర్తికావొచ్చింది. ఆ తరవాత స్పిరిట్ పట్టాలెక్కిస్తారు. ‘కల్కి2’, ‘బ్రహ్మరాక్షస్’ సినిమాలు ప్రభాస్ పూర్తి చేయాల్సివుంది. ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. కానీ ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేయడానికి రెడీ. కాబట్టి మధ్యలో సుకుమార్ సినిమాని పట్టాలెక్కించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ‘స్పిరిట్’ ని ఏక బిగిన అవ్వగొట్టి ‘కల్కి 2,’ ‘బ్రహ్మరాక్షస్’ సినిమాలు మొదలెడతాడు..
ఆ లోగా సుకుమార్ – రామ్ చరణ్ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. సుకుమార్ ఎలాగూ కథ రాసుకోవడానికి కొంత టైమ్ తీసుకొంటాడు కాబట్టి..చరణ్ సినిమా తరవాత..ప్రభాస్ తో ప్రొసీడ్ అవ్వడానికి ఎలాంటి ఆటంకం లేనట్టే. సుకుమార్ కి ఓ హెవీ యాక్షన్ సినిమా చేయాలని ఆశ. హాలీవుడ్ తరహాలో ఓ ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా చేయాలని అనుకొంటున్నారు. అది ప్రభాస్ తో తీరే అవకాశం ఉంది..!!